Vizag Corona Cases: విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా భయం
Vizag Corona Cases: విశాఖ ఏజెన్సీ గిరిజనులను కరోనా భయం వీడటం లేదు.
Vizag Corona Cases: విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా భయం
Vizag Corona Cases: విశాఖ ఏజెన్సీ గిరిజనులను కరోనా భయం వీడటం లేదు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలు జ్వరాలు భారిన పడి విలవిల్లాడుతున్నారు. వీరికి కరోనా వచ్చిందా? మామూలు జ్వరాలా అని నిర్ధారించే దిక్కులేక రోజులు తరబడి మంచానికే పరిమితమయ్యారు. విశాఖ ఏజెన్సీలోని అనేక గ్రామాల ప్రజలు గత వారం రోజుల నుంచి విషజ్వరాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. విశాఖ ఏజెన్సీ పరిధిలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
రోజుల తరబడి తీవ్ర ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తమను ఎవరు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు వేసుకుంటున్న జ్వరం తగ్గడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఆనారోగ్యంతో కొంత మంది గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. అయితే వారంతా విష జ్వరాలతో చనిపోయారా..? లేక కరోనాతో మృతి చెందారా అనేది తేలడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిరిజన ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌లు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.