సీఎం జగన్ కు వ్యతిరేకంగా న్యాయవాదుల ఆందోళన

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అమరావతికి చెందిన హైకోర్టు న్యాయవాదులు జెఎసి ఆందోళన నిర్వహించింది.

Update: 2019-12-23 08:04 GMT

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అమరావతికి చెందిన హైకోర్టు న్యాయవాదులు జెఎసి ఆందోళన నిర్వహించింది. హైకోర్ట్ ను అమరావతిలోనే ఉంచాలని, గతంలో సీఎం జగన్ చెప్పినట్టు రాజధానిని ఇక్కడే కొనసాగించాలని జెఎసి డిమాండ్ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రతిపాదించినప్పుడు అమరావతిలో రాజధాని నిర్మించటానికి జగన్ కూడా అంగీకరించారని జెఎసి నిరసన సందర్భంగా పేర్కొంది. ఇంకా, రాజధాని నగరం నిర్మాణానికి కనీసం 30,000 ఎకరాలు ఉండాలని జగన్ చేసిన డిమాండ్‌ను జెఎసి గుర్తుచేసింది.

అమరావతి రైతులు తమ వ్యవసాయ భూములు 33,000 ఎకరాలకు పైగా రాజధానిని నిర్మించడం కోసమని ఇచ్చారని.. వారంతా రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారని చెప్పారు. కానీ ఇప్పుడు, అదే జగన్ యు-టర్న్ తీసుకొని, రాజధానిని మూడు రాజధానులుగా విభజిస్తానని చెప్తున్నాడు, ఇది జగన్ అనైతికతను నిరూపించిందని అన్నారు. రాజకీయ నాయకులు తమ పార్టీ మైలేజ్ కోసం ఇలాంటి చర్యలు చేయకూడదని జెఎసి సూచించింది. బాధితుల తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తామని న్యాయవాదులు రైతులకు హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News