తిరుమలలో ప్రత్యక్షమైన ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్

సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ నిన్న తిరుమలలో ప్రత్యక్షమైయ్యారు. కుటుంబ సభ్యులతో అయన శ్రీవారిని

Update: 2020-02-24 02:09 GMT
prudhvi Raj(File Photo)

సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ నిన్న తిరుమలలో ప్రత్యక్షమైయ్యారు. కుటుంబ సభ్యులతో అయన శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఎప్పుడు మంచి హుషారుగా కనిపించే పృథ్వీరాజ్ ఈసారి బాగా ముభావంగా కనిపించారు. మీడియా ఆయనను పలకరించబాగా అయన మాట్లాడేందుకు ఆసక్తిని చూపించలేదు. అయన చేతికి కట్టు కట్టుకుని తీరుమల వచ్చారు..

సినీ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరి చాలా ఆక్టివ్ గా ఉంటూ వచ్చారు. జగన్ కూడా పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.. కానీ ఎస్వీబీసీలోని ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన ఓ ఆడియో టేప్ బయటకు రావడంతో పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్స్ ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో అయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో అయన మళ్ళీ తిరుమలలో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది.

పృద్వీ రాజీనామాతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిపై చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఛైర్మన్ పదవిని పక్కన పెట్టి.. ఎండీ పదవిని తెరపైకి తీసుకొచ్చింది. ఛానల్‌ ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమించారు. ధర్మారెడ్డి ప్రస్తుతం టీటీడీ అడిషనల్ ఈవోగా ఉన్నారు. 

Tags:    

Similar News