పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డ నటుడు సుమన్

షాద్‌నగర్‌లో పశువైద్య వైద్యురాలిపై అత్యాచారం చేసిన దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

Update: 2019-12-05 10:10 GMT
సుమన్, పవన్ కళ్యాణ్

షాద్‌నగర్‌లో పశువైద్య వైద్యురాలిపై అత్యాచారం చేసిన దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిందితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిందితులను ఉరితీయకుండా రెండు బెత్తం దెబ్బలు కొట్టాలని సూచించారు. పవన్ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు.పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు ఇలాంటి సంఘటనలు జరిగితే ఆయన కూడా అదే చేస్తాడా అని అడిగారు.

గురువారం మాట్లాడుతూ.. ఇటువంటి సంఘటనల విషయంలో బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని హితవు పలికాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దిశా సంఘటనపై తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు, న్యాయవాదులు మరియు వైద్యులు పాల్గొన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైనా వారు విమర్శలు గుప్పించారు. కాగా దిశా సంఘటన గురించి పవన్ మాట్లాడుతూ.. 'వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆమెకు ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు కొట్టాలి, ఎలా కొట్టాలంటే చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి.

అందరూ చూస్తుండగా కొట్టాలి.. అంతేకాని నడిరోడ్డున ఉరి తీయాలని అంటున్నారు. ఒక మణినిషిని చంపే హక్కు మనకు లేదు.. సమాజం అర్ధం చేసుకోవాలి.. కానీ ఒక మణినిషిని శిక్షించకపోతే ఎలా? శిక్షా ధర్మం ముఖ్యం' అని పవన్‌ వ్యాఖ్యానించారు.



Tags:    

Similar News