బాపట్ల జిల్లా చీరాలలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
*కరెంట్ లైన్లు లాగుతున్న క్రమంలో షాక్‌కు గురైన యువకుడు
బాపట్ల జిల్లా చీరాలలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
Current Shock: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని విజయనగర్ కాలనీలో ఓ యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. విద్యుత్తు కాంట్రాక్టర్ల వద్ద కూలీగా పనిచేస్తున్న యువకుడు, కరెంటు లైన్లు లాగుతున్న సమయంలో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అప్రమత్తమైన సహచరులు సమీపంలోని ఏరియా వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ ఘటనపై విద్యుత్ అధికారులు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.