Car Accident: చిత్తూరు జిల్లాలో కారు బీభత్సం
Car Accident: వేగంగా వెళ్తూ ఇంటి గోడను ఢీకొట్టిన వాహనం, ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలు.
Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో కారు బీభత్సం
Car Accident: చిత్తూరు జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. ఎర్రచందనం దుంగలతో వేగంగా వెళ్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి..రోడ్డుపక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి సమీపంలోని పెద్ద కన్నలి ఎస్టీ కాలనీ దగ్గర ఈఘటన చోటుచేసుకుంది.
కారు వేగంగా వచ్చి ఇంటి గోడను ఢీకొట్టడంతో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలుకాగా వారిని వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు, అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.