అనకాపల్లి జిల్లాలో హడలెత్తిస్తున్న పులి
Anakapalle District: కశింకోట అటవీప్రాంతంలో పులి సంచారం
అనకాపల్లి జిల్లాలో హడలెత్తిస్తున్న పులి
Anakapalle District: అనకాపల్లి జిల్లాలో పులి హడలెత్తిస్తోంది. కశింకోట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గొబ్బురు, నర్సింగిబల్లిలో పులి సంచరిస్తున్నట్లు పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పశువులను కొండల్లోకి తీసుకెళ్లవద్ధని పశువుల కాపరులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పులి జాడ తెలుసుకోవడానికి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశామని...గ్రామాల్లో మైక్‌లతో ప్రచారం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.