పర్యావరణ రక్షణ కోసం ఏపీలో కొత్త చట్టానికి రూపకల్పన

ఏపీలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టానికి రూపకల్పన చేస్తోంది.

Update: 2020-05-20 14:46 GMT
YS Jagan (File photo)

ఏపీలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టానికి రూపకల్పన చేస్తోంది. ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ యాక్ట్‌‌ పేరుతో చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. కాగా.. ఈ చట్టానికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్ వివరించారు. సీఎం క్యాంపు ఆఫీసులో జరిగిన సమీక్షకి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌కుమార్‌ ప్రసాద్, రాష్ట్రం కాలుష్య నియంత్రణ మండలి నుండి(పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్‌ యాదవ్, పులువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పర్యావరణానికి జరిగిన హాని ప్రకారం జరిమానాలు విధిస్తారు. నిర్ణిత జరిమానాలు చెల్లించకపోతే ఆ తర్వాత పెంచుతారు. విధించే జరిమానాలు షాక్‌ కొట్టేలా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. న్యాయనిపుణులను సంప్రదించి చట్టాన్ని సమర్థవంతంగా తీసుకురావాలని సూచించారు.

అయితే ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి జరగకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. మద్యం విషయంలో మనం తీసుకున్న నిర్ణయాలు, మద్యం వినియోగం తగ్గిందన్న అంశాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు.

- ప్రతి కంపెనీ విధిగా నిర్ణీత కాలానికి ఒకసారి స్వయంగా పీసీబీ సూచనల అమలు.

- ఈ రిపోర్టులను థర్డ్‌పార్టీ ఆడిటర్‌ చేత పర్యవేక్షణ, సమీక్ష చేయించేలా ప్రతిపాదన.

- థర్డ్‌పార్టీ ఆడిటర్లుగా ప్రఖ్యాత, విశ్వసనీయ ఏజెన్సీలను ఎంపానెల్‌ చేసేలా చర్యలు.

- జనాభా ఉన్న ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలు రాకుండా చూడాలి.

- జనావాస ప్రాంతాలకు నిర్ణీత దూరంలో ఉండాలని సీఎం ఆదేశాలు.

- ఎంపానెల్డ్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఏజెన్సీస్‌ ఇచ్చిన అంశాలపైఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు దృష్టిపెట్టాలి.

- క్షేత్రస్థాయిలో పరిశీనలు చేసి వాటిపై చర్యలు తీసుకోవాలి.

- ఈ నివేదికలను పబ్లిక్‌ డొమైన్‌లోకి పెట్టాలని సీఎం ఆదేశం. 

Tags:    

Similar News