Srikakulam: సొంత అక్క, అన్నను చంపిన తమ్ముడు
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం * ఆస్తి విషయంలో సొంత అక్క, అన్నను చంపిన తమ్ముడు
Representational Image
Srikakulam: కాకుళం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. సొంత అక్క, అన్నను తమ్ముడే కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కొవ్వాడ పంచాయతీ రామచంద్రపురంలో ఘటన చోటుచేసుకుంది. ఆస్తి విషయంలో గత కొన్ని రోజులుగా అక్క జయమ్మ, అన్న సన్యాసిరావు, తమ్ముడు రామకృష్ణ మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే.. ఈ విషయంపై గ్రామ పెద్దలు హెచ్చరించినప్పటికీ.. తమ్ముడు రామకృష్ణ తన వైఖరి మార్చుకోలేదు. కోపంతో ఊగిపోయాడు. అక్క, అన్నపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జయమ్మ, సన్యాసిరావు అక్కడికక్కడే మృతి చెందారు.