AP High Court: ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ
AP High Court: వైజాగ్‌కు కార్యాలయాలు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ.. పిటిషన్ వేసిన రాజధాని పరిరక్షణ సమితి నేతలు
AP High Court: ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ
AP High Court: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్‌కు తరలించడంపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. వైజాగ్‌కు కార్యాలయాలు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో రాజధాని పరిరక్షణ సమితి నేతలు పిటిషన్ వేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఇవాళ వాదనలు విననుంది. ఈ పిటిషన్‌పై ప్రతివాదులకు అభ్యంతరాలు ఉంటే త్రిసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించే వెసులుబాటు కల్పించింది సింగిల్ బెంచ్.