సాంప్రదాయబద్ధమైన బొమ్మల కొలువు

పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా పోడురు మండలం జిన్నూరు గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన బొమ్మలకొలువు అందరినీ ఆకట్టుకుంటుంది.

Update: 2020-01-15 10:29 GMT

పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా పోడురు మండలం జిన్నూరు గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన బొమ్మలకొలువు అందరినీ ఆకట్టుకుంటుంది. అంతరించిపోతున్న సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియచెప్పే ఉద్దేశంతో ఈ బొమ్మల కొలువు లోని చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా అందరికీ బొమ్మల ద్వారా సులభంగా అర్థమయ్యే విధంగా అలంకరించారు.

వీటికోసం కొండపల్లి బొమ్మల్ని కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా బొమ్మలు సేకరించామని బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన ఉషారాణి తెలిపారు. ఈ బొమ్మల కొలువు లో బాల్యంలో బారసాల నుండి అక్షరాభ్యాసం ఉపనయనం పెళ్లి వేడుకలు పల్లెటూరి వాతావరణం పాడిపంటలు పశువులు భారత్ పాకిస్తాన్ బోర్డర్లో సైనికులు బొమ్మలు శ్రీకృష్ణ పుట్టిన దగ్గర నుండి కృష్ణుడు చేసిన అవతారాలను బొమ్మల రూపంలో అలంకరించడం అందరినీ ఆకట్టుకుంది. 

Tags:    

Similar News