Nellore: మంటల్లో కాలిపోయిన కారు

Nellore: కారులో నుంచి పొగలు రావడంతో గమనించి దిగేసిన కుటుంబం

Update: 2023-09-08 01:45 GMT

Nellore: మంటల్లో కాలిపోయిన కారు

Nellore: నెల్లూరు సమీపంలో 16 నెంబర్ జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. కారులో నుంచి పొగలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు దిగేశారు. విడవలూరు మండలం చౌకచర్ల నుంచి బుజబుజ నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెన్నానది సమీపంలో టిడ్ కో నివాసాల సమీపంలో ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పైనే కారు పూర్తిగా కాలిపోయింది. ప్రాణ నష్టం తప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News