Vijayawada: డ్రైనేజీ పైపుల ద్వారా చొరబాటు...8 మంది అరెస్ట్

Vijayawada: దేశంలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన ఎనిమిది మంది బంగ్లాదేశ్ యువ‌కుల‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2021-07-03 10:21 GMT

Vijayawada Railway Station 

Vijayawada: పాస్ పోర్టు లేకుండా భార‌త్‌లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన ఎనిమిది మంది బంగ్లాదేశ్ యువ‌కుల‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో న‌లుగురిని రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో అరెస్టు చేయ‌గా, మ‌రో న‌లుగురిని విజ‌య‌వాడ‌లో అదుపులోకి తీసుకున్నారు. వారంతా మొద‌ట‌ బంగ్లాదేశ్ నుంచి ప‌శ్చిమ బెంగాల్ హావ్రాలోకి, అక్క‌డి నుంచి రైళ్ల‌లో ప‌లు ప్రాంతాల్లో తిరుగుతున్న‌ట్లు తెలిసింది. వారంతా కొన్నేళ్ల క్రిత‌మే పాస్‌పోర్టు లేకుండా డ్రైనేజీ పైపు ద్వారా భార‌త్‌లోకి చొర‌బ‌డ్డార‌ని పోలీసులు గుర్తించారు. వారి వ‌ద్ద అధికారిక ప‌త్రాలు లేక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి అదుపులోకి తీసుకోగా ప‌లు విష‌యాలు వెలుగులోకి వచ్చాయి.

వారంతా బెంగ‌ళూరు చిరుమానాతో న‌కిలీ ఆధార్‌కార్డులు, పాన్‌కార్డు, ఓట‌ర్ కార్డుల‌తో భార‌త్‌లో తిరుగుతున్నార‌ని పోలీసులు తేల్చారు. 2017-2019 మ‌ధ్య వారంతా గోవాలో ఉన్న‌ట్లు గుర్తించారు. భార‌త్‌లో కొవిడ్ నేప‌థ్యంలో 2019లో బంగ్లాదేశ్ కు వెళ్లారు. గ‌త నెల క్రిత‌మే మ‌ళ్లీ గోవాకు వ‌చ్చి, భార‌త్‌లోని ప‌లు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఎనిమిది మంది యువ‌కుల‌ను పోలీసులు విచారిస్తున్నారు. వారి నుంచి సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకుని ప్రాథమికంగా విచారణ చేశామని మరింత విచారించాల్సి ఉందని విజయవాడ నార్త్ జోన్ ఏసీపీ షానూ షేక్ తెలిపారు.

Tags:    

Similar News