అనకాపల్లి జిల్లా బ్రాండిక్స్ అప్పేరల్ సిటీలో మళ్ళీ గ్యాస్ లీక్..
Andhra Pradesh: ఊపిరాడక 50 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత
అనకాపల్లి జిల్లా బ్రాండిక్స్ అప్పేరల్ సిటీలో మళ్ళీ గ్యాస్ లీక్..
Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. బ్రాండిక్స్ అప్పేరల్ సిటీలో గ్యాస్ లీక్ అయ్యింది. విషవాయువు లీక్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్ కంపనీ నుంచి విషవాయువు లీకవ్వడంతో ఘాటన వాసనతో కార్మికులు ఉపిరి ఆడక ఉక్కిరి బిక్కిరయ్యారు. 50 మంది మహిళా ఉద్యోగులు స్పృహ తప్పి పడిపోయారు. కొందరికి ప్రాథమిక చికిత్స చేసి. విష వాయువు ప్రభావానికి ఎక్కువగా లోనైన వారిని ఫ్యాక్టరీ బస్సులు,, కార్లలో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. గ్యాస్ లీక్ ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. అయితే క్వాంటం సీడ్స్ కంపెనీ యాజమాన్యం మాత్రం ఎలాంటి గ్యాస్ లీక్ కాలేదని చెప్తోంది.