TTD: తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు..కేవలం 20 నిమిషాల్లో 4.8 లక్షల టోకెన్లు బుక్
TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. టీటీడీ ప్రతినెలా ఆన్ లైన్ లో దర్శనం, ఆర్జిత సేవల టోకెన్లను విడుదల చేస్తోంది. అయితే మే నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. అయితే ఈ టికెట్ల హాట్ కేకుల్లా బుక్ అయ్యాయి. సోమవారం రోజు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఒక్కరోజే 4.8లక్షలు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఈ టోకెన్లు కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే అన్నింటినీ స్వామివారి భక్తులు బుక్ చేసుకున్నారు. టీటీడీ ఖజానాకు దాదాపు రూ. 12.24కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని అధికారులు చెబుతున్నారు.
అంతేకాదు మే నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి అంగ ప్రదక్షణ టోకెన్లు విడుదల చేసిన 2 నిమిషాల వ్యవధిలోనే భక్తులు కొనుగోలు చేశారు. అంతేకాదు వయోవృద్ధులు,వికలాంగుల దర్శన టోకెన్లను కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీవాణి దర్శన టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. టీటీడీ రోజుకు 500 చొప్పున 15వేల టికెట్లను టీటీడీ రిలీజ్ చేస్తోంది. శ్రీవాణి టిక్కెట్ల విక్రయాలు పూర్తయితే టీటీడీ ఖజానాకు రూ. 15.75కోట్ల ఆదాయం సమకూరుతుంది.
తిరుమలలోని గోగర్భం సమీపంలో వెలసిన రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీన ఘనంగా అభిషేకం నిర్వహిస్తుంటారు. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్బంగా ప్రతిఏటా ఇక్కడ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల దగ్గరకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు సుగంధ ద్రవ్యాలతో క్షేత్రపాలకునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు.