Visakhapatnam: విశాఖ పెందుర్తిలోని నూకాలమ్మ ఆలయంలో 40 తులాల వెండి.. అమ్మవారి కిరీటం చోరీ
Visakhapatnam: నిందితుడి కోసం కొనసాగుతున్న గాలింపు
Visakhapatnam: విశాఖ పెందుర్తిలోని నూకాలమ్మ ఆలయంలో 40 తులాల వెండి.. అమ్మవారి కిరీటం చోరీ
Visakhapatnam: విశాఖ జిల్లా పెందుర్తి కొత్తవలస రహదారిలో ఉన్న నూకాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. 50 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఉన్న వెండి కిరీటం, పంచపాత్ర, పల్లెం, తదితర సుమారు 40 తులాల వస్తువులు సంచిలో వేసుకుని పరారయ్యాడు. ఆలయంలోకి వ్యక్తి ప్రవేశించి అమ్మవారి వస్తువులను దొంగలిస్తున్న దృశ్యం సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.