Visakhapatnam: షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట రూ.4 కోట్ల కుచ్చుటోపి.. 19 మంది నుంచి డబ్బులు వసూలు

Visakhapatnam: చెల్లింపుల్లో జాప్యంతో రాహుల్‌ గురించి బాధితుల ఆరా

Update: 2023-07-11 05:51 GMT

Visakhapatnam: షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట రూ.4 కోట్ల కుచ్చుటోపి.. 19 మంది నుంచి డబ్బులు వసూలు

Visakhapatnam: విశాఖలో వైట్ కాలర్ మోసం వెలుగులోకి వచ్చింది. షేర్ మార్కెట్లలో పెట్టుబడుల పేరిట ఛాయిస్ స్టాక్ ఎండీ రాహుల్ సింగ్ 4 కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టి వెళ్లిపోయాడు. నగరంలో బిజినెస్ నెట్‌‌వర్క్‌ ద్వారా 19 మంది బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయలు సేకరించిన అనంతరం చెల్లింపుల్లో జాప్యం ఏర్పడింది. బాధితులకు అనుమానం రావడంతో రాహుల్ సింగ్ కోసం స్ధానికులు ఆరా తీశారు. అప్పటికే రాహుల్ తన కుటుంబంతో విశాఖ నుంచి పరారైనట్లు బాధితులు గుర్తించారు. రాహుల్ సింగ్ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Tags:    

Similar News