మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ముగిసిన గడువు

* ఇవాళ నామినేషన్లపై అభ్యంతరాల స్వీకరణ * రేపు అభ్యంతరాలపై తుది నిర్ణయం * 3,323 సర్పంచ్‌ స్థానాలకు 17,664 నామినేషన్లు

Update: 2021-02-10 04:14 GMT

Representational Image

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. నిన్నటితో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసింది. 3 వేల 323 సర్పంచ్‌ స్థానాలకు 17వేల 664 నామినేషన్లు, 32వేల 841 వార్డులకు 77వేల 447 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌ స్థానాలకు అత్యధికంగా విజయనగరంలో ఒకవేయి 973 నామినేషన్లు, అత్యల్పంగా కడప జిల్లాలో 961 నామినేషన్లు దాఖలు కాగా.. వార్డు స్థానాలకు అత్యధికంగా విశాఖలో 8 వేల 555 నామినేషన్లు, అత్యల్పంగా కడపలో 3 వేల 166 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇక ఇవాళ నామినేషన్లపై అభ్యంతరా స్వీకరణ, రేపు అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగా.. ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 17న ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. అనంతరం ఫలితాల వెల్లడి ఉంటుంది. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ ఎంపిక జరగనుంది.

Tags:    

Similar News