ఏలూరులో కొత్త అల్లుడికి ఊహించని విందు.. 379 రకాల ఫుడ్ ఐటెమ్స్ వడ్డించిన అత్తమామలు
*కొత్త అల్లుడికి మర్యాదలతో మనసు నింపే అత్తమామలు
ఏలూరులో కొత్త అల్లుడికి ఊహించని విందు.. 379 రకాల ఫుడ్ ఐటెమ్స్ వడ్డించిన అత్తమామలు
Eluru: ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త అల్లుడు ఇంటికి వచ్చాడంటేనే ఆ మర్యాద వేరే లెవెల్లో ఉంటుంది. వెరైటీ వెరైటీ వంటకాలతో నోరు ఊరేలా చేసి మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఏలూరులో అత్తవారింటికి వచ్చిన ఒక కొత్త అల్లుడికి ఊహించని విందు ఇచ్చారు అత్తమామలు. ఏకంగా 379 రకాల ఫుడ్ ఐటెమ్స్ వడ్డించి స్థానికంగా వార్తలకు ఎక్కారు.