విశాఖ గ్యాస్ లీకేజీ : భయానక స్థితి.. ముగ్గురు మృతి!

Update: 2020-05-07 02:57 GMT
gas leakage in Visakhapatnam

విశాఖపట్నంలోని గోపాలపట్నం దగ్గరలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన కెమికల్ వాయువుతో ముగ్గురు చనిపోయారు. అకస్మాత్తుగా చాలా గాడ్హత తో కూడిన విష వాయువు ఆ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. ఈ వాయువు ఘాటుకు కళ్ళు మంటలతో కళ్ళు కనబడక ఇద్దరు స్థానికులు బావిలో పడిపోయి చనిపోయినట్టు తెలుస్తోంది. మరో మహిళ ఊపిరి అందక మరణించినట్టు చెబుతున్నారు.

ఇక ఈ విశావాయువుతో మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లమీద నడుస్తున్న వారు ఆ ఘటుకి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ఇళ్ళలో వారు ఇళ్లలోనే ఉండిపోయారు. వారి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. చాలామంది ఇళ్ళ తలుపులు బద్దలు కొట్టి అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించారు స్థానికులు.

ఇప్పటికే అక్కడికి స్థానిక ఎమ్మెల్యే గణబాబు, కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ మీనా చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విఃయంపై కలెక్టర్ తో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

అక్కడి తాజా పరిస్థితి ఇలా ఉంది..

* పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

* 25 అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల ద్వారా అస్వస్థతకు గురైన వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు.

* సింహాచలం డిపోనుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు.

Tags:    

Similar News