వైసీపీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో అశ్లీల నృత్యాలు

Update: 2019-11-02 06:14 GMT

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అశ్లీల నృత్యాలు నిర్వహించారు అధికార పార్టీ కార్యకర్తలు. హంగూ ఆర్బాటం లేకుండా తన జన్మదిన వేడుకలను నిర్వహించాలని, పూలమాలలు, కేకు కటింగ్‌ వంటివి చేయొద్దని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రకటిస్తే అందుకు బిన్నంగా వ్యవహరించారు కార్యకర్తలు.. ఉదయం ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపివచ్చిన కార్యకర్తలు.. ఆ తరువాత గానాబజానా ఏర్పాటు చేశారు..

అనపర్తి పెదపూడిలో కార్యకర్తలు బహిరంగంగా నృత్యాలు ఏర్పాటు చేశారు. వేదికపై ఐదుగురు అమ్మాయిలతో అసభ్యంగా నృత్యాలు చేయించారు. పక్కనే పోలీసుస్టేషన్‌ ఉన్నా అశ్లీల నృత్యాలను అడ్డుకోలేదు. అయితే ఈ విషయం సదరు ఎమ్మెల్యేకు తెలియడంతో కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News