ఒక్క క్లిక్‌తో 1 నుంచి ఇంటర్‌ వరకు ఫ్రీగా పాఠ్య పుస్తకాలు

Update: 2020-06-09 14:12 GMT

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్యపుస్తకాలను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు చదువులు అనుకూలంగా సజావుగా సాగాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అన్ని రకాల పాఠ్య పుస్తకాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో రూపొందించి http://allebooks.in/apstate.html వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

ఈ బుక్స్ అన్నింటినీ కూడా ప్రతీ ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అదే విధంగా తెలంగాణ పాఠ్యపుస్తకాలను https://www.ncertbooks.guru/ts-scert-books/ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందే.


Tags:    

Similar News