Kendriya Vidyala Balavatika Admissions: కేవీఎస్ బాలవాటిక ఆన్ లైన్ ఎడ్మిషన్స్ ప్రారంభం

Kendriya Vidyala Balavatika Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక ఎడ్మిషన్స్ ఆన్ లైన్ లో ప్రారంభించారు. ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు వివరాలు తెలుసుకుందాం

Update: 2026-03-20 07:58 GMT

Kendriya Vidyala Balavatika Admissions

Kendriya Vidyalaya Balavatika Admissions: కేంద్రీయ విద్యాలయ సంఘటన్, బాలవాటిక, 1వ తరగతి కోసం కేవీఎస్ 2026-27 ఎడ్మిషన్స్ కోసం అప్లికేషన్లను తీసుకోవడం ఈరోజు (మార్చి 20న) ప్రారంభించింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్, 2. అడ్మిషన్ తీసుకోవాలనుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ కేవీఎస్ సంఘటన్ అఫీషియల్ వెబ్సైట్ kvsangathan.nic.in వెబ్సైట్ లో ఉన్న కేవీఎస్ అడ్మిషన్ అప్లికేషన్ ఫార్మ్ 2026-27 లో వివరాలు నమోదు చేయవచ్చు. కేవీఎస్ బాలవాటిక లో ప్రీ కేజీ, ఎల్ కేజీ, యూకేజీ లకు ఎడ్మిషన్స్ ఇస్తున్నారు.

కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక, ఒకటో తరగతి ఎడ్మిషన్స్ ముఖ్యమైన తేదీలు:

  • కేవీ బాలవాటిక, 1,3 లకు ఎడిమిషన్ నోటిఫికేషన్ మార్చి 19, 2026
  • ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం మార్చి 20, 2026 ఉదయం 10 గంటల నుంచి
  • రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏప్రిల్ 2, 2026
  • ప్రొవిజనల్ సెలక్షన్ అలాగే వెయిట్ లిస్ట్ డిక్లైర్ చేసే తేదీలు ఏప్రిల్ 8, 2026 ఫస్ట్ లిస్ట్, ఏప్రిల్ 16, 2026 సెకండ్ లిస్ట్, ఏప్రల్ 21, 2026 థర్డ్ లిస్ట్
  • ఆఫ్ లైన్ అడ్మిషన్స్ కోసం రెండో నోటిఫికేషన్ ఇచ్చే తేదీలు.. ఏప్రిల్21, 2026 నోటిఫికేషన్, ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 26 2026 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు ఎడ్మిషన్స్ జరుగుతాయి.
  • కొన్ని సెలెక్టెడ్ కేవీఎస్ లలో బ్లావాటిక-2 కోసం ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్స్ ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8, 2026 వరకూ ఉంటాయి.

కేవీఎస్ బాలవాటిక, 1వ తరగతి ఎడ్మిషన్స్ అర్హతలు:

  • బాలవాటిక-1 మూడేళ్ళ వయసు ఉండాలి. అయితే నాలుగేళ్ళకంటే తక్కువ ఉండాలి.
  • బాలవాటిక-2 నాలుగేళ్ల వయసు ఉండాలి. అయితే ఐదేళ్ల కంటే తక్కువ ఉండాలి
  • బాలవాటిక-3 ఐదేళ్ల వయసు ఉండాలి అయితే, ఆరేళ్ళ కంటే తక్కువ ఉండాలి.
  • ఇక క్లాస్ ఒకటి కోసం భారత జాతీయులు, భారత దేశంలో నివసిస్తున్న ఇతర దేశస్థులకు ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం విద్యార్ధి వయసు మార్చి 31 నాటికి ఆరు నుంచి 8 సంవత్సల మధ్య ఉండాలి. ఏప్రిల్ 1న పుట్టిన వారిని కూడా ఎడ్మిషన్స్ కి పరిగణనలోకి తీసుకుంటారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

కేంద్రీయ విద్యాలయ బాలవాటిక ప్రవేశం 2026-27 కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

కేవీఎస్ బాలవాటికలో ప్రవేశాలు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. తల్లిదండ్రులు/గార్డియన్స్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించి, అవసరమైన పత్రాలతో పాటు సమర్పించాలి. బాలవాటిక ప్రవేశానికి ఎలా దరఖాస్తు చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి. ·

స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్, admission.kvs.gov.in ను సందర్శించండి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో "ఎడ్యుకేషనల్" విభాగానికి వెళ్లి, ఆపై "ఎంట్రీ" పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: కేవీఎస్ ప్రవేశ ప్రకటన నుండి బాలవాటిక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 4: "కేంద్రీయ విద్యాలయ బాలవాటిక ఎంట్రీ 2026-27" లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి.

స్టెప్ 5: అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజు ఫోటో, జనన ధృవీకరణ పత్రం మొదలైన అవసరమైన పత్రాలతో పాటు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి

స్టెప్ 6: అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, స్క్రీన్‌పై ఒక కోడ్, అసలు డాక్యుమెంట్స్ లిస్ట్ వస్తుంది.

ఎడ్మిషన్ సమయంలో తల్లిదండ్రులు ఈ లిస్ట్ లో ఉన్న అసలు పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి.

స్టెప్ 7: అప్లికేషన్ సబ్మిట్ కోడ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ లిస్ట్ తప్పకుండా రాసుకోండి. ఎందుకంటే, అవి ఫైనల్ ఎడ్మిషన్ ప్రాసెస్ కోసం ఉపయోగపడతాయి.

Tags:    

Similar News