Prisoners Escape From Covid Center : కోవిడ్‌ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ

Arun Chilukuri
Published on: 25 July 2020 10:38 AM IST
Prisoners Escape From Covid Center : కోవిడ్‌ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ
X

prisoners escape from covid center : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సీఆర్‌ఆర్‌ కోవిడ్‌ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. ఈ రోజు తెల్లవారుజమున ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో 13 మందిని కోవిడ్‌ కేంద్రానికి తరలించారు. జంగారెడ్డిగూడెం, భీమవరానికి చెందిన ఇద్దరు నిందితులు పలు చోరీ కేసుల్లో అరెస్టయి ఏలూరు జిల్లా జైలులో ఏడాది నుంచి రిమాండ్‌ ఖైదీలుగా ఉంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న మిగిలిన ఖైదీలకు ఎస్కార్ట్‌ను అప్రమత్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story