రేవంత్ రెడ్డిపై స్వామి గౌడ్ ప్రశంసల జల్లు

Arun Chilukuri
Published on: 24 Aug 2020 2:36 PM IST
రేవంత్ రెడ్డిపై స్వామి గౌడ్ ప్రశంసల జల్లు
X

కాంగ్రెస్‌ నేత, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ప్రశంసల జల్లు కురిపించారు. హైదరాబాద్‌ బోయిన్ పల్లిలో జరిగిన సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభలో స్వామి గౌడ్ ఆదివారం మాట్లాడారు. రేవంత్ రెడ్డి జన్మించింది రెడ్డి సామాజిక వర్గంలో అయినా ఆయన బడుగు బలహీన వర్గాలకు ఊతమిచ్చారని, వారికి అండగా నిలిచారని స్వామి గౌడ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని మనం గుర్తించి, ఆయనకు అండగా నిలవాలని అన్నారు. తెల్లబట్టల వాళ్లకు మనం అమ్ముడు పోవద్దని ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story