Viral Video: పాన్ తిని ప‌రేషాన్ చేసిన అమ్మాయి..! వీడియో చూస్తే షాకే..

*ఈ వీడియో ఇప్ప‌టికే వంద‌ల లైకులు, వేల వీక్ష‌ణ‌ల‌ను సాధించింది.

hmtv Digital Team
Updated on: 20 Oct 2021 2:46 PM IST
The Shop Owner was Shocked to See the Young Woman Eating Fire Paan Viral Video
X

ఫైర్ పాన్‌ వైరల్ వీడియో (ఫోటో- ఇంస్టాగ్రామ్)

Viral Video: సోష‌ల్‌ మీడియాలో ప్ర‌తిరోజు చాలా వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. నెటిజ‌న్లు వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు ప‌దే ప‌దే చూస్తూ లైక్స్‌, కామెంట్స్ చేస్తారు. మ‌రికొంత‌మంది సోషల్ మీడియాలో హైలెట్ కావడానికి కావాల‌ని కొన్ని వీడియోలు చేస్తారు. వారిని అంద‌రూ వింత‌గా చూసినా వారు చేసే ప‌నుల‌కు నవ్వొస్తుంది. తాజాగా ఒక అమ్మాయి పాన్ తిన్న వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. పాన్ తిన‌డం ఏంటి వైర‌ల్ అవ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఒక్క‌సారి తిల‌కించండి.

వీడియోలో ఓ పాన్‌షాపు ద‌గ్గ‌ర అమ్మాయి పాన్ తిన‌డాన్ని మ‌నం చూడ‌వ‌చ్చు. మొద‌ట‌గా ఒక వ్య‌క్తి మండుతున్న పాన్ (ఫైర్ పాన్‌) చేతిలోకి తీసుకొని అమ్మాయికి తినిపించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. ఆ అమ్మాయి ఫైర్ పాన్‌ని ధైర్యం చేసి మెల్ల‌గా నోట్లో పెట్టుకుంటుంది. ఒక వింతైన ఎక్స్‌ప్రెష‌న్ ఇస్తుంది. అయితే ఈ స‌న్నివేశం మొత్తాన్ని పాన్‌షాప్ ఓన‌ర్ ద‌గ్గ‌రుండి చూడ‌టం మ‌నం వీడియోలో గ‌మ‌నించ‌వ‌చ్చు. అమ్మాయి పాన్ నోట్లో పెట్టుకునేట‌ప్పుడు అత‌డి ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెష‌న్స్ చూస్తే ఎవ్వ‌రికైనా న‌వ్వు ఆగదు. ప్ర‌స్తుతం ఈ ఫ‌న్నీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు బాగా ఇష్టపడుతున్నారు. చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజ‌న్ ఇలా అన్నాడు 'ఆ ఎక్స్‌ప్రెష‌న్ ఏంటి బాబు' మ‌రొక‌రు వీడియో చూస్తూ 'న‌వ్వు ఆపుకోలేక‌పోయా'మ‌న్నారు. ఇలా చాలామంది వినియోగ‌దారులు ఈ వీడియోపై స్పందించారు. ఈ ఫన్నీ వీడియో Instagram లో 'official_viralclips' అనే పేరుతో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్ప‌టికే వంద‌ల లైకులు, వేల వీక్ష‌ణ‌ల‌ను సాధించింది.



hmtv Digital Team

hmtv Digital Team

Next Story