Viral Video : బైక్ స్టంట్ అదిరింది కానీ..ల్యాండింగ్ దగ్గరే తేడా కొట్టింది

Viral Video : బైక్ స్టంట్ అదిరింది కానీ..ల్యాండింగ్ దగ్గరే తేడా కొట్టింది
x
Highlights

Viral Video : బైక్ స్టంట్ అదిరింది కానీ..ల్యాండింగ్ దగ్గరే తేడా కొట్టింది

Viral Video : నేటి కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోవాలనే పిచ్చి యువతను ప్రమాదకరమైన దారుల్లోకి నెడుతోంది. లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా ఒక యువకుడు కదులుతున్న బైక్‌పై నిద్రపోతూ స్టంట్ చేయబోయి.. రోడ్డుపై దారుణంగా పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తూనే, మరోవైపు హెచ్చరిస్తోంది. వైరల్ అవ్వాలనే పిచ్చి మనుషులతో ఎలాంటి పనులు చేయిస్తుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒక గ్రామీణ ప్రాంత రోడ్డుపై కొందరు స్నేహితులు కలిసి బైక్‌లపై వెళ్తున్నారు. అందరి కంటే ముందున్న ఒక యువకుడు తన బ్యాచ్‌లోనే తోపు అనిపించుకోవాలని అనుకున్నాడో ఏమో గానీ.. బైక్ హ్యాండిల్ వదిలేశాడు. అంతటితో ఆగకుండా రెండు కాళ్లను పైకి లేపి, బైక్ సీటుపై పడుకుని చాలా రిలాక్స్‌డ్ గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. వెనుక ఉన్న స్నేహితులు ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధిస్తున్నారు.

అయితే, ఆ యువకుడు పడుకున్న కొద్ది సెకన్లకే బైక్ బ్యాలెన్స్ తప్పింది. హ్యాండిల్ పట్టుకునే లోపే బైక్ స్లిప్ అయిపోయింది. దీంతో ఆ యువకుడు రోడ్డుపై దారుణంగా దొర్లిపోయాడు. అదృష్టవశాత్తూ వెనుక నుంచి వేరే వాహనాలు ఏవీ వేగంగా రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ, రోడ్డుపై పడటంతో అతనికి గట్టిగానే దెబ్బలు తగిలి ఉండవచ్చని వీడియో చూస్తే అర్థమవుతోంది. రీల్స్ కోసం చేసే ఇలాంటి పనులు చివరికి ఆసుపత్రి పాలు చేస్తాయని ఈ వీడియో మరోసారి రుజువు చేసింది.

ఈ వీడియోను Xలో @mdtanveer87 అనే ఐడితో షేర్ చేశారు. "రీల్స్ అయితే పూర్తయ్యాయి భయ్యా, ఇప్పుడు వెళ్లి మందులు, కొత్త చెప్పులు కొనుక్కో.. రోడ్డు భద్రత ఎక్కడ?" అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు. ఈ 20 సెకన్ల వీడియోను ఇప్పటికే వేలాది మంది చూశారు. నెటిజన్లు రకరకాలుగా సెటైర్లు వేస్తున్నారు. "నీ స్టంట్‌కి పడిపోవడం హైలైట్ భయ్యా" అని ఒకరు, "నీ ప్రాణాల కంటే ఆ 15 సెకన్ల రీలే ఎక్కువైపోయిందా?" అని మరొకరు ప్రశ్నిస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, హెల్మెట్ లేకుండా ఇలాంటి విన్యాసాలు చేయడం వల్ల అటు తమకే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికులకు కూడా ప్రమాదం వాటిల్లుతుంది. పోలీసులు ఇలాంటి స్టంట్ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నా మార్పు రావడం లేదు. లైకుల కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం ఆపేయాలని, రోడ్డుపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories