రైతుల పాలిట శాపంగా మారుతున్న ఫార్మ కంపెనీల వ్యర్ధాలు

రైతుల పాలిట శాపంగా మారుతున్న ఫార్మ కంపెనీల వ్యర్ధాలు
x
Highlights

ఫార్మా కంపెనీల వ్యర్థ రసాయనాలు రైతుల పాలిట శాపంగా మారాయి.

ఫార్మా కంపెనీల వ్యర్థ రసాయనాలు రైతుల పాలిట శాపంగా మారాయి. విశాఖ జిల్లా పరవాడలో ఫార్మాకంపెనీ నుంచి వెలువడుతున్న వ్యర్ధాలతో పెద్దచెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. ఫార్మా వ్యర్థ రసాయనాలు చెరువులోకి ప్రవేశిస్తుండటంతో ఆక్సిజన్ అందక చేపలు చనిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల సమయంలో తరచూ వ్యర్ధ రసాయనాలు బయటకు విడుదల చేస్తుండటంతో అవి చెరువుల్లోకి వచ్చి చేరుతున్నాయని చెప్పారు. ఫార్మా కంపెనీ వ్యర్ధ రసాయనాలతో పంటలు, మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాంకీ ఫార్మా సిటికి చెందిన పంపు హౌస్ దగ్గర ఫార్మా వ్యర్ధ జలాల మ్యాన్ హోల్ లీకై రోడ్లపైకి మురుగు నీరు వరదగా పొంగిపొర్లింది. ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories