వరలక్ష్మి హత్యకు ఓ మెసేజ్ కారణమని పోలీసుల నిర్ధారణ
విశాఖ జిల్లాలోని గాజువాకలో జరిగిన వరలక్ష్మీ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వరలక్ష్మి హత్యకు ఓ మెసేజ్ కారణమని పోలీసులు నిర్ధారించారు. అక్టోబర్ 27వ తేదీన వరలక్ష్మి తన మొబైల్ నుంచి అఖిల్‌కు మెసేజ్ పంపినట్లు గుర్తించారు. అయితే వరలక్ష్మి రామ్‌కు మెసేజ్ పంపించబోయి పొరపాటున అఖిల్‌కు పంపినట్లు తెలుసుకున్నారు. ఈమెసేజ్‌తో నాలుగు రోజుల పాటు అఖిల్ వరలక్ష్మిని వేధించినట్లు పోలీసులు గుర్తించారు.
Next Story




