Top
logo

Singer Vangapandu Prasad Rao: ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత

Singer Vangapandu Prasad Rao: ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత
X
Highlights

Singer Vangapandu Prasad Rao: ప్రముఖ వాగ్గేయకారుడు, ఉత్తరాంధ్ర జానపద కాణాచి వంగపండు ప్రసాదరావు...

Singer Vangapandu Prasad Rao: ప్రముఖ వాగ్గేయకారుడు, ఉత్తరాంధ్ర జానపద కాణాచి వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తెల్లవారుజామున పార్వతీపురంలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాసను విడిచారు. వంగపండు ప్రసాదరావు వందలాది జానపద పాటలను రచించడమే కాకుండా.. వాటికి గజ్జెకట్టి ఆడి పాడారు. పల్లెకారులతో పాటు, గిరిజనులకు కూడా అవగాహన కల్పించిన ప్రసాదరావు.. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని ఎలుగెత్తి.. గొంతెత్తారు. ఆయన మృతికి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జానపద కళాకారులు, ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.Web TitleFolk Singer Vangapandu Prasada Rao Passed Away
Next Story