తిరుమల: సర్వదర్శన టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు

Arun Chilukuri
Published on: 31 Oct 2020 11:34 AM IST
తిరుమల: సర్వదర్శన టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు
X

తిరుమల సర్వదర్శన టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు కాస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వ దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. తెల్లవారుజామున జారీ చేయాల్సిన టోకెన్లను ముందే జారీ చేయడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. కనీసం భౌతిక దూరం కూడా ఉండేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోలేదు దాంతో గుంపులు గుంపులుగా భక్తులు క్యూ లైన్‌లో వేచి చూస్తున్నారు. అయితే సర్వదర్శనం టోకెన్ల జారీ పై టీటీడీ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story