Car Washed Away in the Kallugotla Vagu: వాగులో కొట్టుకుపోయిన కారు.. మ‌హిళ గ‌ల్లంతు

Arun Chilukuri
Published on: 25 July 2020 11:06 AM IST
Car Washed Away in the Kallugotla Vagu: వాగులో కొట్టుకుపోయిన కారు.. మ‌హిళ గ‌ల్లంతు
X

car washed away in the kallugotla vagu: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చూస్తుండగానే ఓ మహిళ కారుతో సహా వాగులో కొట్టుకుపోయింది. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారుతో సహా మహిళ గల్లంతైంది. ఓ కుటుంబం కర్నూలు నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరింది. అయితే, గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కలుగొట్ల సమీపంలో రోడ్డుపై నుంచి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు కారు దిగగా, ఆవలి ఒడ్డుకు కారును చేర్చే ప్రయత్నంలో మహిళ కారుతో సహా కొట్టుకుపోయింది. మరో వైపు బొంకూరు వద్ద వాగు ఉద్ధృతికి తాత్కాలిక రహదారి దెబ్బతిని అలంపూర్‌-రాయ్‌చూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story