పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం : అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స

Arun Chilukuri
Published on: 27 Oct 2020 1:14 PM IST
పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం : అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స
X

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రి బొత్స. అలాగే పైడితల్లి అమ్మవారిని ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ దర్శించుకున్నారు.

సాయంత్రం నాలుగు గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కానున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. సిరిమానోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు వీధుల్లో 15 చోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఇతర జిల్లాలు, రాష్ట్రాల ప్రజలు పైడితల్లి అమ్మవారిని వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత దర్శించుకోవాలని సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story