Air Force Rescue Operation: వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎయిర్ ఫోర్స్

Air Force Rescue Operation: వ‌ర‌ద నీటిలో చిక్కున్న ఓ వ్య‌క్తి ప్రాణాల‌ను ఇండియన్ ఆర్మీ కాపాడింది. ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న న‌ది నుంచి తాడు సాయంతో ఆ వ్య‌క్తిని ప్రాణాలు కాపాడారు. బిలాస్‌పూర్‌ సమీపంలో ఖుతాఘాట్‌ ప్రాంతంలో భారీ వరదలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు.

Karampoori Rajesh
Published on: 17 Aug 2020 8:50 PM IST
Air Force Rescue Operation: వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎయిర్ ఫోర్స్
X
Air Force Rescue Operation

వ‌ర‌ద నీటిలో చిక్కున్న ఓ వ్య‌క్తి ప్రాణాల‌ను ఇండియన్ ఆర్మీ కాపాడింది. ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న న‌ది నుంచి తాడు సాయంతో ఆ వ్య‌క్తిని ప్రాణాలు కాపాడారు. బిలాస్‌పూర్‌ సమీపంలో ఖుతాఘాట్‌ ప్రాంతంలో భారీ వరదలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. వరదలో తనను తాను రక్షించుకోవటానికి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఉండిపోయాడు. ఆదివారం సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు అలాగే ఉన్నాడు. దీనిని గమనించిన కొందరు స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో హెలికాప్టర్ లో అక్కడకు చేరుకున్న వాయుసేన దళ సిబ్బంది తాడును కిందకు వదిలి అతడిని పైకి లాగి, కాపాడారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story