సెల్‌టవర్‌ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Arun Chilukuri
Published on: 19 Oct 2020 12:16 PM IST
సెల్‌టవర్‌ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

ఉద్యోగం పేరుతో మోసం చేశారంటూ ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. దేవరాజు గట్టు గ్రామానికి చెందిన సయ్యద్ సలీం స్థానిక వైసీపీ నేతలు తనను మోసం చేసినట్లు ఆరోపిస్తున్నాడు. షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇప్పిస్తామని ఏడు లక్షలు తీసుకున్నారని ఉద్యోగం ఇవ్వకపోగా తాను చెల్లించిన డబ్బులు కూడా ఇవ్వటం లేదని సెల్‌టవర్‌ ఎక్కాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని కిందకు దింపే యత్నం చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story