Viral Video: ఆంటీ డ్యాన్స్‌ చూస్తే అదిరిపోవాల్సిందే.. వాటే ఎక్స్ప్రెషన్స్ .. వాటే స్టెప్పులు..

* ఈ వీడియో చూస్తే ఎవ్వరైనా సరే ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

hmtv Digital Team
Updated on: 7 Nov 2021 6:43 PM IST
A Dance Performed by an Aunty at a Wedding Ceremony is Going Viral on Social Media
X

ఆంటీ డ్యాన్స్‌ చూస్తే అదిరిపోవాల్సిందే(ట్విట్టర్ ఫోటో)

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వివాహ వేడుకలలో జరిగే చిలిపి సన్నివేశాలు, డ్యాన్స్కి సంబంధించిన వీడియోలను నెటిజన్లు బాగా ఇష్టపడుతారు. ఎక్కువ సార్లు చూస్తూ ఆనందిస్తారు.

అంతేకాకుండా లైక్స్, షేర్స్, కామెంట్స్ చేస్తూ సంతోష పడుతారు. తాజాగా ఓ వివాహ వేడుకలో ఓ ఆంటీ చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఉత్సాహపరుస్తుంది. ఈ వీడియో చూస్తే ఎవ్వరైనా సరే ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఆ సంగతేందో మనం తెలుసుకుందాం.

ఈ వీడియో వివాహ వేడుకలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక ఆంటీ 'బాలా ఓ బాలా' సాంగ్ కి ఫన్నీ డ్యాన్స్ చేయడం మనం గమనించవచ్చు. అయితే ఆమె డ్యాన్స్ని వివాహానికి వచ్చిన అందరు నవ్వుతూ తిలకిస్తారు. అంతేకాదు ఆ ఆంటీ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అందరికి నవ్వు తెప్పిస్తుంటాయి. అదేవిధంగా అదిరిపోయే స్టెప్స్ వేస్తే అందరిని ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తూ సరదాగా నవ్వుకుంటున్నారు.

ఈ వీడియోపై వినియోగదారులు ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 13 వేలకు పైగా చూశారు. అంతేకాదు పదే పదే చూస్తు ఆనందిస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా స్పందించాడు.

ఆంటీ భలే డ్యాన్స్ చేసిందని పొగిడాడు. మరోకరు ఇలా కామెంట్ చేశాడు. ఇలాంటి డ్యాన్స్ చూసినప్పుడు తన వివాహ వేడుకని గుర్తు చేసిందన్నాడు. ఇంకొకరు ఆంటీ డ్యాన్స్ చూసి నవ్వు ఆపుకోలేకపోయానని చెప్పాడు. ఇలా చాలామంది రకరకాలుగా కామెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.


hmtv Digital Team

hmtv Digital Team

Next Story