తండ్రిని మించుతున్న తనయుడు ఈ సంగీత దర్శకుడు.

మారి 2 సినిమాలో రౌడి బేబీ…అంటూ ఏంతో మంది తో చిందులు వేయించిన ప్రముఖ సినిమా సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. ఈ రోజు యువన్ శంకర్ రాజా పుట్టినరోజు.

Srikanth Kondapalli
Published on: 31 Aug 2019 8:24 AM IST
తండ్రిని మించుతున్న తనయుడు ఈ సంగీత దర్శకుడు.
X

మారి 2 సినిమాలో రౌడి బేబీ…అంటూ ఏంతో మంది తో చిందులు వేయించిన ప్రముఖ సినిమా సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. ఈ రోజు యువన్ శంకర్ రాజా పుట్టినరోజు. ఇతను ప్రముఖ తమిళ్, తెలుగు సంగీత దర్శకులు మాత్రమే కాదు మరో ప్రముఖ సంగీత దర్శకులయిన ఇళయరాజా గారి అబ్బాయి కూడా. 1996 లో అరవిందన్ అనే సినిమా ద్వారా 16 ఏళ్ళ వయసులో సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన యువన్ 2013లో వచ్చిన బిరియాని సినిమాతో 15 ఏళ్ళలో 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు. వీరి సంగీతం పాశ్చ్యాత సంగీతం లా వుండటం నేటి యువతకి బాగా కనెక్ట్ అయ్యింది.

అలాగే తమిళనాట రీమిక్స్ సంప్రదాయాన్ని మొదలుపెట్టిన వీరు తెలుగునాట కూడా అనతికాలంలో కీర్తి గడించారు. ముఖ్యంగా యువన్ తను పనిచేసిన సినిమాలకు ఇచ్చిన నేపథ్య సంగీతానికి విమర్శకుల, ప్రేక్షకుల మెప్పును పొందారు. సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా యువన్ శంకర్ రాజా కావడం గమనార్హం. యువన్ శంకర్ రాజ నుండి ఇంకా ఎన్నో అద్భుతమైన సంగీతం రావాలని ఆశిస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story