సుమన్ పుట్టినరోజు ఈ రోజు.

అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రతో, శ్రీరామదాసు సినిమాలో రాముని పాత్ర తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికి నిలిచిపోయిన సుమన్ పుట్టిన రోజు ఈ రోజు. సుమన్ గా తెలుగు సినిమాకు సుపరిచితుడైన సుమన్ తల్వర్ సినీరంగ నటుడు.

Srikanth Kondapalli
Updated on: 28 Aug 2019 11:51 AM IST
సుమన్ పుట్టినరోజు ఈ రోజు.
X

అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రతో, శ్రీరామదాసు సినిమాలో రాముని పాత్ర తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికి నిలిచిపోయిన సుమన్ పుట్టిన రోజు ఈ రోజు. సుమన్ గా తెలుగు సినిమాకు సుపరిచితుడైన సుమన్ తల్వర్ సినీరంగ నటుడు. ఈయన నీచల్ కులం సినిమాతో రంగప్రవేశము చేసి తెలుగు, తమిళ, కన్నడ మరియు ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో నటించాడు. కరాటే యొక్క షాట్‌కన్ శైలి లో నిష్ణాతుడైన సుమన్ మన తెలుగులో పెద్ద యాక్షన్ హీరో అయ్యాడు.

ఈయన అన్నమయ్య సినిమాలో పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు చిత్రములో పోషించిన రాముని పాత్ర మరపురానివి. షోటోకన్ కరాటే సంస్థనుండి కరాటేలో బ్లాక్ బెల్ట్ 1 డాన్ సాధించిన సుమన్ ఆంధ్రప్రదేశ్ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడు కూడా. హైదరాబాదులో స్థిరపడిన సుమన్ ప్రముఖ తెలుగు నాటక రచయిత డి.వి.నరసరాజు యొక్క మనుమరాలు శిరీషను వివాహము చేసుకొన్నాడు. ఈ పుట్టినరోజు తనకి మరిన్ని మంచి పాత్రలు తీసుకురావాలని ఆశిద్దాము.

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story