తెలుగు తెర విశ్వనట చక్రవర్తి ఎస్. వి. రంగారావు

Srikanth Kondapalli
Updated on: 3 July 2019 11:44 AM IST
తెలుగు తెర విశ్వనట చక్రవర్తి ఎస్. వి. రంగారావు
X

తెలుగు సినిమా చరిత్రంలో ఎప్పటికి నిలిచేపోయే పేరు… తెలుగు వెండితెర పై వెలిగిన విశ్వ నట చక్రవర్తి, తన నట విశ్వరూపంతో కథానాయకుల కన్నా కూడా, ఎక్కువ పేరు సంపాదించిన మహానటుడు రంగరావు గారు పుట్టిన రోజు ఈ రోజు.

ఎస్. వి. రంగారావు గా సుప్రసిద్ధుడైన సామర్ల వెంకట రంగారావు ప్రముఖ సినీ నటుడు మరియు దర్శకుడు, రచయిత. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసులోనూ, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నాడు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో పాల్గొనేవాడు. అప్పట్లోనే తన లోని నటుడిని ప్రపంచానికి పరిచయం చేసాడు.

ఆ తర్వాత చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేశాడు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశాడు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించాడు.

రంగారావు గారు రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నాయి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఈయన బిరుదులు పొందారు. ఈ నాటికీ ప్రతి తెలుగు నటుడు గర్వంగా చెప్పుకునే పేరు ... ఎస్.వి. రంగారావు.

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story