ప్రపంచ కప్ కపిల్ రికార్డు

Srikanth Kondapalli
Updated on: 18 Jun 2019 4:33 PM IST
ప్రపంచ కప్ కపిల్ రికార్డు
X

ఈ రోజు క్రికెట్ చరిత్రలో 1983 ప్రపంచ కప్ పోటిలో జింబాబ్వేపై జరిగిన వన్డే మ్యాచ్ లో కపిల్ దేవ్ సాదించిన 175 నాట్ అవుట్ రికార్డు. అప్పట్లో ఇది చాల అరుదైన రికార్డు. కపిల్ దేవ్ పూర్తి పేరు రాంలాల్ నిఖంజ్ . ఇతను భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడుగా ప్రపంచం గుర్తించే వ్యక్తి. 1959, జనవరి 6న ఛండీగఢ్లో జన్మించిన కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుసంపాదించాడు.

2002 లో విజ్డెన్ పత్రికచే 20 వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందినాడు. కపిల్ సారథ్యం వహించిన ఏకైక ప్రపంచకప్ (1983) లో భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగష్టు వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.

కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. 1980 లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో జింబాబ్వేపై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్. నేడు క్రికెట్ తో అనుబంధమైన ఎన్నో విషయల్లో ఆక్టివ్గా ఉంటున్నాడు మన కపిల్.

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story