దిల్ వాలేకి దుల్హనియా పుట్టిన రోజు ఈ రోజు.

Srikanth Kondapalli
Updated on: 5 Aug 2019 12:21 PM IST
దిల్ వాలేకి దుల్హనియా పుట్టిన రోజు ఈ రోజు.
X

నేడు... కాజోల్ పుట్టినరోజు. దిల్ వాలే దుల్హనియా లేజాయంగే తో తన నటనని, అందాన్ని పంచి బాలీవుడ్ లో ఎప్పటికి తన స్థానం పదిలపరుచుకున్న తార...కాజోల్. ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించింది. షారుక్ ఖాన్ మరియు కాజోల్ జోడీ బాలీవుడ్లో హిట్ పెయిర్ గా ఖ్యాతిచెందింది. ఈవిడ తల్లి తనూజ. ప్రముఖ నటి. తండ్రి పేరు షోము ముఖర్జీ. ఆయన దర్శకనిర్మాత. ఇద్దరూ కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే కావడంతో... చిన్నప్పట్నుంచీ చుట్టూ సినిమా వాతావరణమే. కానీ తల్లిదండ్రులిద్దరూ ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటంతో ముంబైలోనిపాంచ్‌గనిలో సెంట్ జోసెఫ్ కాన్వెంట్ బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు. క్లాస్‌లో హెడ్‌గాళ్. చదువు కంటే ఇతర వ్యాపకాలపైనే ఆసక్తి. డ్యాన్స్ నేర్చుకొంది. ఫిక్షన్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకొంది.

అవే జీవితంలో ఎదిగేందుకు దోహదపడ్డాయని చెబుతుంటుంది. ఫిక్షన్ నవలలు చదవడం వల్ల కష్టాల్ని అలవోకగా అధిగమించానని చెబుతుంటుంది. 'గుండారాజ్'లో నటిస్తున్నప్పుడు అజయ్ దేవగణ్‌తో ప్రేమలో పడింది. 1994లో మొదలైన ప్రేమాయణం 1999దాకా కొనసాగింది. కాజోల్ కెరీర్ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో పెళ్ళి చేసుకోవడం పట్ల కూడా విమర్శలొచ్చాయి. అయితే ఇద్దరూ వాటిని బేఖాతరు చేశారు. ఓ ఇంటివారై కలిసి నడిచారు. ఆ జంటకి ఇద్దరు పిల్లలున్నారు. నైసా అనే అమ్మాయితో పాటు, యుగ్ అనే అబ్బాయి ఉన్నాడు. పెళ్ళి తర్వాత ఎక్కువగా అతిథి పాత్రల్లో కనిపిస్తున్న కాజోల్... సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. చిన్నారులు, వితంతువుల సంక్షేమం కోసం పలు స్వచ్ఛందే సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఆ విషయంలో కాజోల్‌కి కర్మవీర్ పురస్కారం లభించింది. ఇలాంటి పుట్టిన రోజులు కాజోల్ ఇంకా ఎన్నో చేసుకొని, తన నటనతో అభిమానులందరిని అలరించాలని ఆశిద్దాము.

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story