Trending Video: హలో పోలీస్.. మా డాడీని అరెస్ట్ చేయండి! చిన్నారి కాల్..
Trending Video: ఒక వీడియోలో ఒక చిన్నారి తన తండ్రిని అరెస్ట్ చేయమని పోలీసులకు ఫోన్ చేస్తోంది. అలా ఎందుకు చేస్తోందో తెలిస్తే అయ్యో చిట్టితల్లి అని అనిపిస్తుంది.
Trending Video
Trending Video: చిన్నపిల్లలు చేసే పనులు భలే ముద్దుగా ఉంటాయి. అలాగే, ఒక్కోసారి ఆలోచింపచేస్తాయి కూడా. వాళ్ళు ముద్దుగా మాట్లాడుతుంటే విని మురిసిపోతారు తల్లిదండ్రులు. కానీ, వారి మాటల్లో తమ వేదన కూడా ఉంటుంది. చిన్నారుల ముద్దు మాటల వెనుక ఉండే ఆలోచన అర్ధం అయితే, మన ప్రవర్తన కచ్చితంగా మార్చుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే, మనం తెలిసీ తెలియకుండా చేసే కొన్ని పనుల వలన వారు ఎంత బాధపడ్తున్నారనేది వారి మాటల్లో ఉంటుంది. అది తెలుసుకుంటే, పిల్లలను చక్కగా హ్యాండిల్ చేయగలుగుతాం. అయితే, దాదాపుగా అది అసాధ్యం అనుకోండి. కానీ,ఇదిగో ఈ వీడియోలో చిన్నారి మాటలు విన్నాకా.. కొన్ని విషయాల్లో అయినా మనం జాగ్రత్తగా ఉండాల్సిందే అనిపిస్తుంది.
సోషల్ మీడియాలో చాలా వీడియోలు ప్రతిరోజూ హల్ చల్ చేస్తుంటాయి. చాలా వీడియోలు ఫన్నీగా ఉంటాయి. అవి చూసి మనసారా నవ్వుకుంటాం. అలాంటిదే ఒక వీడియో ఇది. ఒక చిన్నారి తన తండ్రిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫోన్ చేస్తోంది. అందుకు కారణం తెలిస్తే నవ్వాపుకోలేం. అదే పరిస్థితిలో ఆ చిన్నారి పరిస్థితికి మనసు కరిగిపోతుంది.
ఈ వీడియోలో ఒక చిన్నారి పోలీసులకు.. హలొ పోలీస్.. మా డాడీని అరెస్ట్ చేయండి. అతను నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు.. నా ప్లేస్ ను ఇంకో బేబీ ఆక్యుపై చేసింది అని ఏడుస్తూ చెప్పడం కనిపిస్తుంది. ముద్దులు మూటగట్టేలా క్యూట్ గా ఉన్న ఆ చిన్నారి.. ముద్దు ముద్దుగా ఏడుస్తూ అలా చెబుతుంటే.. వెనుక పక్క ఆమె తండ్రి ఒడిలో ఒక చంటి బిడ్డను ఎత్తుకుని నవ్వుకుంటూ ఉండడం కనిపిస్తుంది.
ఇక ఈ వీడియో TheTinyDictatorDiary అనే ఇంస్టా హ్యాండిల్ లో కనిపించింది. ఈ వీడియోకు ఇప్పటికే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. అయితే, ఈ వీడియో చూసి మనం నవ్వుకున్నా.. ఆ చిన్నారి క్యూట్ మాటలకూ మురిసిపోయినా.. ఆ మాటల వెనుక ఉన్న ఆ చిన్నారి ఆవేదన కూడా అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా రెండో బిడ్డ పుట్టినపుడు ఆ బిడ్డను కొంచెం కేరింగ్ గా చూడటం జరుగుతుంది. అది అవసరం కూడాను. కానీ, ఆ కేరింగ్ విషయం మొదటి పాపాయికి తెలీదు కదా. తనను ఎవాయిడ్ చేసి కొత్తగా వచ్చిన చిన్నారికి ఎక్కువ ప్రేమ ఇస్తున్నారని బాధ పడుతుంది. ఇదిగో ఇలా ఈ చిన్నారి తన బాధను వ్యక్తం చేస్తోంది. ఈ వీడియో ఫన్నీగా ఉన్నా.. చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మంచి మెసేజ్ పాస్ చేస్తోంది. అందుకే దీనిని మీ ముందుకు తెచ్చాము. ఆ వీడియో ఇక్కడ మీరు కూడా చూసేయండి.. నిజమే అని ఒప్పుకుంటారు!




