Jordar Varthalu: గ్యాస్ కొరతపై నారాయణ వెరైటీ నిరసన

Jordar Varthalu
x

Jordar Varthalu: గ్యాస్ కొరతపై నారాయణ వెరైటీ నిరసన

Highlights

Jordar Varthalu: దేశంలో పెరుగుతున్న గ్యాస్ ధరలు మరియు కొరతపై సీపీఐ నేత నారాయణ వినూత్న నిరసన! గ్యాస్ లేక వంట చేసుకోలేక పండ్లు తింటూ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

Jordar Varthalu: దేశంలో గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, సామాన్యులు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ కళ్లు మండించుకుంటున్నారు. కానీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కాక మాత్రం గ్యాస్ కొరతపై తనదైన స్టైల్‌లో సెటైర్లు వేస్తూ కేంద్ర సర్కారును ఆడేసుకున్నాడు. ఏకంగా వంట చేసే బాధే లేదన్నట్టు కమ్మగా పండ్లు తింటూ నిరసన తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచిండు.

గ్యాస్ లేక ఇంట్లో కనీసం కాఫీ, టీ కూడా పెట్టుకోలేని పరిస్థితి వచ్చిందని నారాయణ కాక వాపోయారు. "గ్యాస్ లేదు.. వంట లేదు.. పండ్లు తిని బతకాల్సి వస్తోంది" అంటూ ఆయన పండ్లు తింటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదే కానీ, కాఫీలు తాగే భాగ్యం కూడా లేకపోవడం ఏందని నారాయణ కాక తన ఆవేదనను వెరైటీగా వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories