Trending Video: టీచరే చెప్పలేకపోతే నేనెలా చదువుతా? చిన్నారి ప్రశ్నకు ఆన్సర్ చెప్పగలరా?

Trending Video: ఒక చిన్నారి తన తల్లిని అడిగిన ప్రశ్నకు ఆ తల్లి అవాక్కయితే, ఆ వీడియో చూసే మనకు నవ్వు ఆగదు. ఆ వీడియో ఏమిటో.. ఆ కథేమిటో ఇక్కడ చూసేయండి.

KVD Varma
Published on: 17 March 2026 12:16 PM IST
Trending Video: ఒక చిన్నారి తన తల్లిని అడిగిన ప్రశ్నకు ఆ తల్లి అవాక్కయితే, ఆ వీడియో చూసే మనకు నవ్వు ఆగదు.
X

Trending Video

Trending Video: సాధారణంగా మనం చిన్న పిల్లలు ఏదైనా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడతాం. పిల్లలకు వచ్చే డౌట్స్ అలా ఉంటాయి. కొన్ని మనకు కూడా సమాధానం తెలీని ప్రశ్నలు అడుగుతారు చిన్నారులు. ఒక్కోసారి మనకు తెలిసినా వారికి చెప్పలేని సమాధానం ఉన్న ప్రశ్నలు సాధిస్తారు. ఇక కొంతమంది గడుగ్గాయిలైతే మనల్ని మారు మాట్లాడనీయకుండా ప్రశ్నిస్తారు. ఈ గడుగ్గాయిలడిగె ప్రశ్నకి సమాధానం చెప్పలేక తల్లిదండ్రులు సతమతం అవుతుంటే.. ఆ సీన్ చూసేవారికి మాత్రం నవ్వు ఆగదు. ఇంకో విషయం ఏమిటంటే ఆ ప్రశ్నలోనూ నిజముంది కదా అనేలా మనల్ని తికమకపరుస్తారు.

ఇదిగో అలాంటి ప్రశ్నలతోనే తన తల్లిని ముప్పుతిప్పలు పట్టింది ఓ చిన్నారి. ఇంస్టాగ్రామ్ లో కనిపించిన ఈ వీడియో చూస్తే మనకు నవ్వు ఆగదు. ఇది సరదా కోసం చేసిన రీల్ అయినా.. ఆ వీడియోలో పాప అడిగిన ప్రశ్నకి ఆమె తల్లి ఏమి చెప్పాలో తెలీక అయోమయంలో పడిపోతే.. ఆ అవస్థ చూసే మనకి నవ్వాగదు.

ఈ వీడియోలో ఒక తల్లి సోఫాలో కూచుని ఎదో మ్యాగజైన్ తిరగేస్తోంది. అక్కడే ఒక పాప హోమ్ వర్క్ చేసుకుంటోంది. సడన్ గా ఆ చిన్నారి అమ్మా.. నిన్నో ప్రశ్న అడగనా? అని చాలా మర్యాదగా అడిగింది. దానికి ఆ తల్లి అడుగు అని చెప్పింది. “వేరే వేరే సబ్జెక్ట్స్ కి వేరే వేరే టీచర్స్ ఎందుకున్నారు?” ప్రశ్న సంధించింది ఆ పాప.

ఓసీ ఇదీ ఓ ప్రశ్నేనా? అనే ఫీలింగుతో ఆ తల్లి..”ఎందుకంటే, అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్పలేదు కాబట్టి” అని ఠకీమని చెప్పేసి మురిపెంగా ఓ నవ్వు విసిరేసింది. ఇప్పుడు ఆ గడుగ్గాయి “ మరి అలా అయితే, అన్ని సబ్జెక్ట్స్ నేనొక్కదానినే ఎలా చదవాలి?” అని అడిగింది. మరి మీకేమైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం తెలుసా? ఆ అమ్మ మాత్రం ఈ అల్లరి ప్రశ్నకు అవాక్కయిపోయింది.

ఈ వీడియో ప్రత్యేకంగా రీల్స్ కోసం తీసినట్టు కనిపిస్తున్నా.. ఆ చిన్నారి హావభావాలకు.. ఆ తల్లి ఎక్స్ ప్రెషన్స్ కు ఫుల్ మార్కులు ఇచ్చేయొచ్చు. అలాగే ఆ ప్రశ్న కూడా వ్యాలీడ్ గానే ఉంది కదా. అందుకే, సరదాగా నవ్వుకుంటారని మీకోసం jaya_ammulu1 అనే ఇంస్టా యూజర్ రీల్ ను ఇక్కడ పరిచయం చేస్తున్నాం.


KVD Varma

KVD Varma

Next Story