Dog Acting: ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా.. యాక్టింగ్ లో ఆస్కార్ ఇచ్చేయాలి!
Dog Acting: కూటికోసం కోటి విద్యలు.. ఈ సామెత మనుషులకే కాదు.. కుక్కలకూ వర్తిస్తుంది. ఎందుకంటారా? అది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే!
Dog Acting:
Dog Acting: మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఒక బిచ్చగాడు రోడ్డు మీద కాళ్లు లేనట్లుగా పడి ఉంటాడు. దారిన పోయేవాళ్లు అతనికి అయ్యో పాపం అని బిచ్చం వేస్తుంటారు. పొద్దుపోతుంది. చీకటి పడుతుంది. ఆ వ్యక్తి ఎవరూ లేని సమయంలో మెల్లగా లేచి బిచ్చం వచ్చిన పైసలు లుక్కేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది మనకు నవ్వు తెప్పిస్తుంది. ఇలా సహజంగా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది కూడా. సరే సంపాదన కోసం ఎవరి తెలివి వారిది కదా.
అయితే, ఇలాంటి సీన్స్ బాగా చూసిందో ఏమో.. ఒక కుక్క చేసిన పని నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఓర్నీ ఏషాలో అని ఆ కుక్కను చూసి ముద్దుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజనం. అవును.. ఒక కుక్క తన ఆహరం కోసం ఆస్కార్ రేంజ్ యాక్షన్ చేస్తోంది. అదేం చేసిందో ఒక నెటిజన్ వీడియో తీసి తన X ఎకౌంట్ లో పోస్ట్ చేశారు. అదిప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. కూటి కోసం కోటి విద్యలు అనే సామెత మనకెలాగూ ఉంది. ఇప్పుడు దానిని ఈ కుక్క కోసం కూటి కోసం కోటి వేషాలు అని మార్చుకోవచ్చనిపిస్తుంది.
బజారులో ఒక కుక్క కాళ్ళు విరిగిపోయినట్టు రోడ్డుపై దేకుతూ వెళుతోంది. అది నేరుగా ఒక ఫుడ్ స్టాల్ వద్దకు కళ్ళు ఈడ్చుకుంటూ దీనంగా వెళ్ళింది. ఆ ఫుడ్ స్టాల్ లోని మహిళ ఆ కుక్కను చూసి జాలిపడి కొంత ఆహరం దాని ముందు పాడేసింది. ఎప్పుడైతే ఆహరం తన నోట్లో పడిందో వెంటనే ఆ కుక్క చటుక్కున పైకి లేచి నాలుగు కాళ్లపై నడుస్తూ ఆహారాన్ని తీసుకుని చక్కగా వెళ్ళిపోయింది.
డి ఘోష్ అనే x ఎకౌంట్ లో ఈ వీడియో కనిపించింది.ఇక్కడ ఆ వీడియో మీరు కూడా చూసేయండి.. మీరూ వామ్మో ఈ కుక్క మామూలుది కాదు అని అనుకోవడం గ్యారెంటీ.




