Mothkur: తండ్రి మరణించినా.. కన్నీళ్లతోనే పరీక్షకు..!

Mothkur: పదో తరగతి పరీక్షలు ప్రారంభం రోజునే ఓ విద్యార్ధి తండ్రి కన్నుమూశాడు. తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకొని పరీక్షకు హాజరయ్యాడు ఆ విద్యార్ధి.

Arun Chilukuri
Updated on: 14 March 2026 12:42 PM IST
Mothkur: తండ్రి మరణించినా.. కన్నీళ్లతోనే పరీక్షకు..!
X

Mothkur: తండ్రి మరణించినా.. కన్నీళ్లతోనే పరీక్షకు..!

Mothkur: పదో తరగతి పరీక్షలు ప్రారంభం రోజునే ఓ విద్యార్ధి తండ్రి కన్నుమూశాడు. తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకొని పరీక్షకు హాజరయ్యాడు ఆ విద్యార్ధి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ప్రభుత్వం ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య రాత్రి పదిగంటల సమయంలో గుండెపోటుతో చనిపోయాడు. ఎల్లయ్య కొడుకు తండ్రి మరణవార్తను దిగమింగుకుని... దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని కన్నీళ్ల మధ్య హృదయవిదారతతో పరీక్షకు హాజరయ్యాడు.

ఎల్లయ్య గుండాల మండలం వస్తాకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రతీ క్షణం ప్రేమానురాగాలు పంచిన తండ్రి మరణం ఒక వైపు.. తన భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష మరో వైపు ఆ విద్యార్ధి లేతా హృదయాన్ని ఉక్కిరిబిక్కిరిచేశాయి.. తనను అత్యుత్తమ విద్యావంతుడిగా తీర్చిదిద్దాలన్న తన తండ్రి కోరికను తీర్చేందుకు తండ్రి మృతి చెందినా పరీక్షకు హాజరయ్యాడు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story