Khammam: శుభకార్యంలో అంతులేని విషాదం.. ఫొటో దిగుతూనే ప్రాణాలు వదిలిన యువతి!

Khammam: ఖమ్మం జిల్లాలో విషాదం. గృహప్రవేశ వేడుకలో ఫొటో దిగుతూ సుష్మిత అనే యువతి గుండెపోటుతో కన్నుమూసింది.

Arun Chilukuri
Published on: 16 March 2026 4:44 PM IST
Khammam: శుభకార్యంలో అంతులేని విషాదం.. ఫొటో దిగుతూనే ప్రాణాలు వదిలిన యువతి!
X

Khammam: శుభకార్యంలో అంతులేని విషాదం.. ఫొటో దిగుతూనే ప్రాణాలు వదిలిన యువతి!

ఖమ్మం: ఆ ఇంట గృహప్రవేశ వేడుక జరుగుతోంది.. బంధుమిత్రుల రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. అంతలోనే ఊహించని విషాదం ఆ ఇంటిని ముంచెత్తింది. ఫొటో దిగుతున్న సమయంలోనే ఓ యువతి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో వేడుక కాస్తా తీవ్ర విషాదంగా మారింది.

క్షణాల్లోనే అనంతలోకాలకు..

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతానికి చెందిన సుష్మిత తన బంధువుల ఇంట్లో జరుగుతున్న గృహప్రవేశ వేడుకకు హాజరైంది. వేడుకలో భాగంగా అందరితో కలిసి సరదాగా గడుపుతూ, ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు ఫొటో దిగుతోంది. సరిగ్గా అదే సమయంలో ఆమెకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

వైద్యులు చేతులెత్తేశారు

కుప్పకూలిన సుష్మితను చూసి బంధువులు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నిన్నటి వరకు తమ మధ్యే తిరిగిన యువతి, ఇలా క్షణాల్లో కళ్ళముందే ప్రాణాలు కోల్పోవడంతో సుష్మిత కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story