MLA Disqualification Case: పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ సంచలన తీర్పు.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ ఊరట!

MLA Disqualification Case: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు.

Arun Chilukuri
Updated on: 11 March 2026 12:36 PM IST
MLA Disqualification Case: పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ సంచలన తీర్పు.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ ఊరట!
X

MLA Disqualification Case: పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ సంచలన తీర్పు.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ ఊరట!

MLA Disqualification Case: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లన్నింటినీ ఆయన కొట్టివేశారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. సదరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. కేవలం ఈ ఇద్దరే కాకుండా, ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు.

ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై రేపు (గురువారం) సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. కోర్టు విచారణకు ఒకరోజు ముందే స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించినట్లయింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story