Telangana Budget 2026-27: తెలంగాణ కేబినెట్‌ భేటీ.. బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం

Telangana Budget 2026-27: తెలంగాణ రాష్ట్ర శాసనసభ వేదికగా బడ్జెట్ సందడి మొదలైంది.

Arun Chilukuri
Updated on: 20 March 2026 11:26 AM IST
Telangana Budget 2026-27
X

Telangana Budget 2026-27: తెలంగాణ కేబినెట్‌ భేటీ.. బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం

Telangana Budget 2026-27: తెలంగాణ రాష్ట్ర శాసనసభ వేదికగా బడ్జెట్ సందడి మొదలైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది.

ముఖ్య అంశాలు:

శాఖల వారీగా కేటాయింపులు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ముసాయిదాకు మంత్రివర్గం ఓకే చెప్పింది.

కేబినెట్ ఆమోదం అనంతరం, ఈ మధ్యాహ్నం శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని చదవనున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గ్యారంటీల అమలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు చేయబోతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story