Telangana Budget 2026-27: తెలంగాణ భారీ బడ్జెట్ @ 3.26 లక్షల కోట్లు.. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా రేవంత్ సర్కార్ పద్దు..!
Telangana Budget 2026-27: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
Telangana Budget 2026-27: తెలంగాణ భారీ బడ్జెట్ @ 3.26 లక్షల కోట్లు.. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా రేవంత్ సర్కార్ పద్దు..!
Telangana Budget 2026-27: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే.. ఈ సారి మొత్తం 3.26 లక్షల కోట్ల రూపాయలతో పద్దును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ విజన్ - 2047 డాక్యుమెంట్ లోని అంశాలపై ప్రత్యేక నిధుల కేటాయింపులు జరిగే ఛాన్స్ ఉంది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మండలిలో మంత్రి ఉత్తమ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా.. ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. సంక్షేమం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమం, సన్న బియ్యం కోసం భారీగా నిధులు కేటాయించేందుకు సర్కార్ రెడీ అయినట్లు సమాచారం. రైతు భరోసా, రైతు బీమా, సన్న వడ్ల బోనస్ వంటి పథకాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. తుమ్మిడిహెట్టి, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, కొడంగల్ నారాయణ్ పేట్ ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్‌బీసీలకు ఈ బడ్జెట్‌లో రేవంత్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలను ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ బడ్జెట్‌లో వీటికి కూడా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. మూసీ పునరుజ్జీవం, ఆర్ఆర్ఆర్, ఎయిర్‌పోర్టులు, హైదరాబాద్ మెట్రో రెండో దశ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ వంటి వాటికి భారీగా నిధుల కేటాయింపు ఉండే అవకాశాలు ఉన్నాయి.




